బాక్సింగ్‌లో పతకాల పంట | - | Sakshi
Sakshi News home page

బాక్సింగ్‌లో పతకాల పంట

Oct 5 2026 1:09 AM | Updated on Oct 5 2026 1:09 AM

పర్లాకిమిడి: ఒడిశా రాష్ట్ర 70వ స్కూల్‌ స్థాయి బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2026–27 గంజాం జిల్లా బరంపురం మహాత్మాగాంధీ స్టేడియంలో ఈ నెల 2, 3 తేదీల్లో జరిగింది. ఈ బాక్సింగ్‌ పోటీల్లో పర్లాకిమిడి సరస్వతీ శిశు విద్యామందిర్‌కు చెందిన బాలిక దివ్యబెనియా అండర్‌ 14 క్యాటగరీలో(40 కిలోలు) గోల్డ్‌ మెడల్‌ సాధించింది. బాలుర విభాగంలో అండర్‌ 17 విభాగంలో మహారాజా బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఆర్‌.రోహిత్‌కు బ్రాంజ్‌ మెడల్‌ లభించింది. 50 కిలోల బరువు బాక్సింగ్‌లో బినోదినీ సైన్స్‌ కళాశాల (పద్మపూర్‌) విద్యార్థి సాగర్‌ మండల్‌కు గోల్డ్‌ మెడల్‌, గురండి మీనాకేతన్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి చందన్‌ గోయాకు సిల్వర్‌ మెడల్‌, గురండీ మీనాకేతన్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి జగన్‌ బెనియా (57కిలోలు) గోల్డ్‌ మెడల్‌, పి.ఎం.శ్రీ మహారాజా బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి గగన్‌ బెనియాకు (75 కిలోలు) గోల్డ్‌ మెడల్‌తో సత్తా చాటినట్లు కోచ్‌ బెనియా తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement