పర్లాకిమిడి: స్థానిక కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం సేవాసంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో గజపతి జిల్లా ప్రైవేటు బస్సు ఓనర్ల యాజమాన్యం, ఒడిశా రోడ్డు ట్రాన్సుపోర్టు ఆధ్వర్యంలో డ్రైవర్లు లేదా కర్మచారి, ఆపద సమయంలో పాసింజర్లను ఎలా కాపాడాలి, మంటలను బస్సులో ఎలా ఆపాలి? అన్న అంశంపై మ్యాక్ డ్రిల్ ద్వారా చైతన్యం కల్పించారు. కార్యక్రమంలో గజపతి ఆర్టీఓ తపన్‌కుమార్ బెట్టి, అగ్నిమాపక దళం ఎస్‌ఐ సుకాంత మహాంతి, గజపతి ప్రైవేటు బస్సుల యాజమాన్య సంఘం అధ్యక్షులు ఛిత్రి సింహాద్రి, ఎంవీఐ సర్వేశ్వర్ చౌదురి, సెక్రటరీ ప్రసన్న కుమార్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు. బస్సులో మంటలు ఏర్పడితే ఎలా ఆర్పాలో నేర్పించారు. మాక్‌డ్రిల్ కూడా చేయించారు.


