బాణసంచా దుకాణం సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

బాణసంచా దుకాణం సీజ్‌

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

పర్లాకిమిడి: కాశీనగర్‌ రోడ్డులో గుమ్మగెడ్డ వద్ద ఉన్న టోకు బాణసంచా దుకాణంలో బుధవారం మధ్యాహ్నం పెట్రోలింగ్‌ పోలీసులు దాడులు జరిపి రూ.8 లక్షల బాణసంచాను స్వాధీనం చేసుకున్నారు. నియమానుసారం ఇంత మొత్తంలో లైసెన్సు లేకుండా బాణసంచా విక్రయం చేస్తున్నందుకు పోలీసు సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ టోకు బాణసంచా దుకాణంలో... ఈ ఏడాదికి బాణసంచా లైసెన్సు లేకుండా అమ్ముతున్నందుకు ఆదర్శ పోలీసు ష్టేసన్‌ అధికారుల బృందం దుకాణంలో తనిఖీలు చేపట్టి మొత్తం ఎనిమిది లక్షల ఆక్రమ బాణసంచాను పర్లాకిమిడి స్టేషన్‌కు తరలించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ. ప్రపుల్ల జగరంగా, ఎస్‌ఐ కృత్తికా శెఠి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బాణసంచా దుకాణాన్ని పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కేసును విచారిస్తున్నట్టు ఐఐసీ ప్రశాంత భూపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement