విద్యార్థులకు క్విజ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు క్విజ్‌ పోటీలు

Jul 28 2026 1:36 AM | Updated on Jul 28 2026 1:36 AM

జయపురం: జయపురంలోని సోషియన్‌ ఎన్విరోన్‌మెంటల్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (సీవా) ఆధ్వర్యంలో స్థానిక సిటీ ఉన్నత పాఠశాలలో అంతర పాఠశాలల స్థాయి క్విజ్‌ పోటీలను సోమవారం నిర్వహించారు. పోటీలను సీవా సభ్యులు, నవరంగపూర్‌ జిల్లా వ్యవసాయ విభాగ విశ్రాంత అధికారి జి.వెంకటరెడ్డి పర్యవేక్షించగా పట్టణంలోని పలు పాఠశాలలకు 8, 9, 10 తరగతులకు చెందిన 31 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో ఆరుగురు ఫైనల్‌ పోటీలకు ఎన్నికయ్యారు. ఆయుష్‌ పట్నాయక్‌(జయపురం సిటీ స్కూలు,) సుమిత్ర పండ (ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల), దింపుల్‌ అక్షయకుడుకుల (మోడరన్‌ ఇంగ్లిష్‌ స్కూల్‌), అనన్య త్రిపాఠీ(ఎస్‌.ఎస్‌.వి.ఎం.శారదవిహార్‌), శ్రేయన్స్‌ శతపతి (ప్రకాశ్‌ విద్యాలయ్‌), సుభ్రాన్సు శేఖర నంద (ఎస్‌.ఎస్‌.వి.ఎం.శారదవిహార్‌)లు ఫైన్‌లో తలపడ్డారు. అనంతరం ఫైనల్‌ పోటీలు ఆరు రౌండ్లలో నిర్వహించగా ఆయుష్‌ పట్నాయక్‌ ప్రథమ, శ్రేయాన్స్‌ శతపతి ద్వితీయ, సుభ్రాన్సు శేఖర నంద తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నగదు బహుమతితో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. ముఖ్యఅతిథిగా బ్లాక్‌ విద్యాధికారి చందన కుమార్‌ నాయిక్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీవా నిర్వహించిన ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించటంతో పాటు పోటీతత్వాన్ని అలవాటు చేసుకోవచ్చునన్నారు. జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విశ్రాంత ఉపాధ్యాయులు ప్రకాశ్‌ చంద్ర పట్నాయక్‌, సీవా సంస్థ అధ్యక్షులు అజయ కుమార్‌ మిశ్ర, కార్యదర్శి ప్రతాప్‌ కుమార్‌ పట్నాయక్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement