అరణ్య కథా పఠనం | - | Sakshi
Sakshi News home page

అరణ్య కథా పఠనం

Jun 17 2026 12:58 AM | Updated on Jun 17 2026 12:58 AM

జయపురం: రొజ్జో సంక్రాంతి ముగిసిన దినాన జయపురం భగ్రా అడవిలో ‘అరణ్య కథా పఠన కార్యక్రమం’ నిర్వహించారు. ఒడిశా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కథా రచయితలు పాల్గొన్నారు. బరగడ్‌ జిల్లాపైకమాల్‌ బిజయ కుమార్‌ ఆహ్వానం మేరకు రుద్ర ప్రసన్న బిశ్వాల్‌, గేయ రచయిత మీణా స్వైన్‌, కార్యక్రమ సమన్వయకర్త విజయలక్ష్మీ పాణిగ్రహి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన అడవి వాతావరణంలో కథకులు సచిదానంద ప్రధాన్‌, ప్రదేశీ బారిక్‌, బిజయ ప్రధాన్‌, సావిత్రీ పురోహిత్‌, ప్రీతి నందా పాణిగ్రహి, సునీతా దేవత, పుస్పా నారాయణ్‌, అభా ఆర్య వంటి ప్రముఖ ఒడియా కథారచయితలు పాల్గొన్నారు. స్థానిక కథా రచయితలు మీణా స్వైన్‌, రుధ్ర ప్రసన్న బిశ్వాల్‌, రమేష్‌ సాహు, రవి శతపతి, శుభ నారాయణ్‌ స్వైన్‌, నిరంజన్‌ పాణిగ్రహి, విజయలక్ష్మీ పాణిగ్రహి, పుష్పలత ముదులి, పంకజ్‌ మహంతి, సమర్పితా పాణిగ్రహి, నివేదిత పాణిగ్రహి తమ స్వీయ కథలను చదివి వినిపించారు. పలు జిల్లాల నుంచి వచ్చిన కథా రచయితలకు ‘కొరాపుటియ మండియా సూప్‌’ కొరాపుట్‌ కాఫీలు కొరాపుట్‌ జిల్లా కమ్మని వంటకాలతో నిర్వాహకులు విందునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement