పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం గ్రామ ముఖిపరిపాలన, స్పందన కార్యక్రమానికి 20 వినతులు అందాయి. ఆదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఫల్గునీ మఝి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి దయామయ పాఢి, కాశీనగర్ సమితి అధ్యక్షురాలు బల్ల శాయమ్మ పాల్గొన్నారు. కాశీనగర్, గొరిబోంద, ఖండవ, పురుటిగుడ పంచాయతీల నుంచి 20 వినతులు అందాయి. వాటిలో గ్రామసమస్యలకు సంబంధించినవి పది, వ్యక్తిగతానికి సంబంధించి పది ఉన్నాయి. జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ద్వారా ఎనిమిది మందికి మధుబాబు పింఛన్ పథకం కింద డబ్బులు అందజేశారు. అలాగే దివ్యాంగునికి ప్రభుత్వ వివాహా ప్రోత్సాహకం క్రింద రూ. 2.50 లక్షల చెక్కును లబ్థిదారునికి అందజేశారు. కాశీనగర్ బీడీవో డంభుధర మల్లిక్, సీడీఎంవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.


