‘వృద్ధులపై వేధింపులు తగవు’ | - | Sakshi
Sakshi News home page

‘వృద్ధులపై వేధింపులు తగవు’

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

శ్రీకాకుళం కల్చరల్‌: వృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమానికి పనిచేయడం అత్యవసరమని జిల్లా సీనియర్‌ సిటిజన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బలివాడ మల్లేశ్వరరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని శాంతా కల్యాణ అనురాగ నిలయంలో ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించా రు. వృద్ధుల ఆస్తి, ప్రాణ రక్షణకు చర్యలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వృద్ధుల వికలాంగుల సహాయ సంచాలకులు బి.దేవరాజ్‌, ప్రత్యేక అతిథి పెన్షనర్ల జేఏసీ అధ్యక్షు లు సీహెచ్‌ పురుషోత్తమనాయుడు, ముఖ్య అతిథి గా హాజరైన సంఘ గౌరవాధ్యక్షుడు పోలుమహంతి జగన్మోహన రావులు మాట్లాడుతూ వృద్ధుల పట్ల దుర్భాషలు, వేధింపులు లేకుండా వారికి గౌరవం ఇచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. రైల్వే రాయితీలు వంటివి తీసేయడం దారుణమన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement