విద్యుత్‌షాక్‌తో వృద్ధుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో వృద్ధుడు మృతి

Jun 17 2026 12:52 AM | Updated on Jun 17 2026 12:52 AM

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి సమితి జాదుగూఢ గ్రామంలో సోమవారం సంబారు మాడ్కమి (80) అనే వృద్ధుడు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. యోగిని పడియమి అనే మహిళ సమీప అడవిలో వేదురు కర్ర సహయంతో టోలా పండ్లను కోస్తుంది. అయితే ఆ చెట్టుకు ఆనుకొని 11 కేవీ విద్యుత్‌ తీగను తగిలి ఆమెకు షాక్‌ కొట్టింది. దీంతో ఆమె కేకలు వేయడంతో సమీపంలో ఉన్న సంబారు మాడ్కమి వచ్చి ఆమెను రక్షించే ప్రయత్న్‌ం చేయగా.. అతనికి కూడా షాక్‌ తగిలింది. దీంతో ఇద్దరినీ స్థానికులు మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికు తరలించగా.. సంబారు మాడ్కమి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహిళలను కాపాడి తను ప్రాణాలు కోల్పోయ్యాడు. గాయపడిన వ్యక్తికి చికిత్స అందజేస్తున్నారు. మల్కన్‌గిరి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రానికి కుటుంబసభ్యులకు అప్పగించారు. సంబారు మృతితో గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement