ఆశయ సాధనే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ఆశయ సాధనే ధ్యేయం

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

న్యూస్‌రీల్‌

రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి బాకురుగుడలో బీఎస్‌ఎం కార్యకర్తల

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026
బిజూ పట్నాయక్‌ ..

రాయగడ:

రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహానాయకుడు బిజూ పట్నాయక్‌ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ (బీఎస్‌ఎం ) సంస్థ పనిచేస్తుందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బిజూ స్వాభిమాన్‌ వ్యవస్థాపకులు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి బాకురుగుడ సమీపంలో బుధవారం నిర్వహించిన బీఎస్‌ఎం కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ఎన్నో సేవలు అందించి మహానీయుడిగా గుర్తింపు పొందిన బిజూ పట్నాయక్‌ పేరిట ఆవిర్భవించిన ఈ సంస్థ ప్రజల ప్రయోజనాలకు, వారి సంక్షేమానికి మాత్రమే పనిచేస్తోందని స్పష్టం చేశారు. జిల్లాలో రాజకీయాలు భ్రష్టుపడ్డాయని అందువల్ల బీఎంఎస్‌ ఆధ్వర్యంలో రానున్న పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ప్రజల అభిమతం తెలుసుకునే ప్రయత్నంలో ఇటీవల కొలనార సమితిలో సమావేశం నిర్వహించగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని అన్నారు. అనంతరం రాయగడ సమితిలో నిర్వహించిన సమావేశంలో కూడా అత్యధికంగా ప్రజలు పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

జులై నెల నుంచి అన్ని సమితుల్లో సమావేశాలు

ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో జూలై నెల నుంచి జిల్లాలోని అన్ని సమితుల్లొ బిజు స్వాభిమాన్‌ మంచ్‌ సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని నెక్కంటి ప్రకటించారు. ఈ సమావేశాలతో ప్రజల అభిమతం తెలుసుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఆవిర్భవించిన ఈ సంస్త ప్రజలకు చేరువయ్యే దిశగా పయనిస్తుందని అన్నారు. అందువల్ల ముందుగా అవిభక్త కొరాపుట్‌ జిల్లాలో తమ కార్యకలాపాలను విస్తరించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. వారిని తీర్చిదిద్దడమే ధ్యేయంగా తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. తన వెంట ఉన్న వారికి అండగా నిలబడేందుకు తాను ఎటువంటి సహాయాన్ని చేయడానికై నా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. అలాగ రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్‌ఎం సంస్థను విస్తరించే దిశగా త్వరలో అభిమానులు, మద్దతుదారుల సలహాల మేరకు కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. ఏదిమైనప్పటికీ రానున్న పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బీఎస్‌ఎం తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపుతామని స్పష్టం చేశారు. అవసరమైతే తమ సహాయాన్ని కోరే ఏ పార్టీకై న తమ మద్దతు ఇచ్చే విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వివరించారు. రాజకీయ పార్టీకి అతీతంగా ఆవిర్భవించిన బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ ఇకపై తన సత్తా చాటుకునే విధంగా క్షేత్రస్తాయి నుంచి పనులు ప్రారంభిస్తుందని నెక్కంటి అన్నారు. ప్రజల ఆదరాభిమానాలు ఉన్నంత వరకు ఈ సంస్థ ముందుకు దూసుకుపోతుందన్నారు. ప్రజల అభీష్టం మేరకు పనిచేస్తుందని ప్రకటించారు.

వెన్నుపోటు పార్టీలకు బుద్ధి చెబుతాం: మాజీమంత్రి లాల్‌ బిహారి హిమిరిక

రాజకీయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన నాయకుడు నెక్కంటి భాస్కరావుకు తామెప్పుడు మరిచేదిలేదని రాష్ట్ర మాజీ మంత్రి లాల్‌ బిహారి హిమిరిక అన్నారు. సమావేశంలొ పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. ఆయన హయాంలొ జిల్లా సమగ్రాభివృద్ధి చెందిందని అన్నారు. గ్రామాలకు తాగునీరు, రహదారుల ఏర్పాటు వంటి ఎన్నో మౌలిక సౌకర్యాలు కల్పించారని అన్నారు. అయితే కుటిల రాజకీయ పార్టీల కారణంగా నెక్కంటి కొన్ని పార్టీలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. అయితే పార్టీలకు దూరమైనప్పటికీ ప్రజా సేవయే పరమావధిగా తన నిరంతర కృషి కొనసాగిస్తున్నారని అన్నారు. ఆయన కృషి ఫలితమే బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ సంస్థ ఆవిర్భవించిందని హిమిరిక అన్నారు. ఈ సంస్థ ద్వారా జిల్లాలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు అంతా కలసి కట్టుగా కృషి చేస్తామని అన్నారు. వెన్నుపోటు పొడిచే నాయకులకు, కొన్ని రాజకీయ పార్టీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పేవిధంగా తమ వ్యూహాలు ఉంటాయని అన్నారు. సమావేశంలొ శ్రీక్షత్ర టౌన్‌షిప్‌ అధినేత దూడల శ్రీనివాస్‌ రావు ఆదివాసీ భాషలో ప్రసంగించి బిజూ స్వాభిమాన్‌ మంచ్‌ పనితీరు గురించి వివరించారు. ఈ జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు అందించిన నెక్కంటికి తామంతా అండగా ఉండి తమవంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. సంస్థ నాయకులు బనాఘటి తిరుపతి, కాసీపూర్‌ సమితి అధ్యక్షుడు కంఠొ మాఝి, రాయగడ సమితి అధ్యక్షురాలు టున్ని హుయిక, వైస్‌ చైర్మన్‌ హరప్రసాద్‌ హెప్రుక, సీనియర్‌ నాయకుడు సుభాష్‌ బక్షీ, జిల్లా పరిషత్‌ సభ్యురాలు సంధ్యాపులక తదితరులు ప్రసంగించారు. అంతకు ముందు కొత్తపేట నుంచి సమావేశ వేదిక వద్దకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలొ పాల్గొన్న నెక్కంటి సుమారు రెండు కిలొమీటర్ల దూరం కాలినడకన నడిచి వేదిక వరకు చేరుకున్నారు. ర్యాలీలో ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

సమావేశం

ఉంటామని వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement