అమరవీరుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల విగ్రహాల ఏర్పాటుకు చర్యలు

Jun 4 2026 5:34 AM | Updated on Jun 4 2026 5:34 AM

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో

సభ్యుల చర్చ

పర్లాకిమిడి: పురపాలక సంఘ సమావేశం బుధవారం మున్సిపల్‌ కార్యాలయం మందిరంలో బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి విచ్చేశారు. ఆయనకు కౌన్సిల్‌ చైర్మన్‌, సభ్యులు ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యుల చర్చించారు. ప్రధానంగా పట్టణంలోని పలు ముఖ్యమైన స్థలాల్లో స్వాతంత్య్ర సమరయోధులు, ఒడిశా రాష్ట్ర ఆవిర్భావానికి కృషిచేసిన మహానీయుల విగ్రహాల ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మున్సిపల్‌ పరిధిలో అనేక వార్డుల్లో డ్రైనేజీలు మరమ్మతులు కొన్నేళ్లుగా జరగకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సభ్యులు అన్నారు. వాటిని తిరిగి పునఃనిర్మాణం చేయాలని కోరారు. మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ లెంక మధు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ లక్ష్మణముర్ము, ఎంపీ ప్రతినిధి అదర్శదాస్‌, సరిహద్దు ప్రహరీ పూర్ణచంద్ర మహాపాత్రో, కౌన్సిలర్లు బాలక్రిష్ణ పాత్రో, బిభూతి పాత్రో తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement