పర్లాకిమిడి: మతిస్థిమితం కోల్పోయిన యువకుడు సిద్ధేశ్వర సాబత్ (34) ఈ నెల ఒకటో తేదీ నుంచి కనబడడం లేదని తండ్రి అప్పన్న సాబత్ స్థానిక పోలీసు ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఒడియాలో తక్కువగా మాట్లాడుతున్న ఈ యువకుడు మహేంద్ర మేళాకు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఎవరికై నా యువకుడి వివరాలు తెలిస్తే పర్లాకిమిడి ఆదర్శ పోలీసు ష్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఐఐసీ ప్రశాంత్ భూపతి బుధవారం తెలియజేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని పోలీసు ష్టేషన్లకు సమాచారం అందజేసినట్లు ఐఐసీ తెలిపారు. దర్యాప్తు చేపడుతున్నామన్నారు.


