రాయగడ: జిల్లాలోని నియమగిరి పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న డొంగిరియా తెగకు చెందిన ఆదివాసీలను ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆదేశాల మేరకు బిసంకటక్ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారి నవీన్ చంద్ర నాయక్ పర్యవేక్షణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా అధికారులు నియమగిరి గిరిజన గ్రామాలను సందర్శించారు. అర్హులైన ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. బీడీఓ శివప్రసాద్ పట్నాయక్, జీపీడీఓ సుదీప్ కృష్ణబెహర, సూపర్‌వైజర్ హరిదాస్ భొత్ర, బూత్ స్థాయి అధికారులు ఉమేష్ పెద్దింటి, భీమా కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.


