ఉచిత దంత వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

ఉచిత దంత వైద్య శిబిరం

Jun 1 2026 1:08 AM | Updated on Jun 1 2026 1:08 AM

జయపురం: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా భారత దంత వైద్యుల సంఘం జయపురం శాఖ ఆధ్వర్యంలో స్థానిక పట్టణ పోలీసుస్టేషన్‌లో ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బందితోపాటు స్థానిక ప్రజలకు వైద్యులు దంత పరీక్షలు చేసి మందులు అందజేశారు. దంత పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. శిబిరంలో వందమందికి పైగా దంత రోగులు చికిత్స పొందినట్లు భారత దంత వైద్యుల సంఘం జయపురం శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ రూపేష్‌ కుమార్‌ బెవురియ వెల్లడించారు. జయపురం సబ్‌డివిజన్‌ పోలీసు అధికారిణి అర్చిత మిత్తల్‌, జయపురం పట్టణ పోలీసు అధికారులు శిబిరం నిర్వహణకు సహకరించారు. సంఘ మాజీ అధ్యక్షులు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ దాస్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ నాయిక్‌, డాక్టర్‌ అమిత్‌ దాస్‌, కోశాధికారి డాక్టర్‌ దేవ దేవరాహన్‌ బిశాయి, డాక్టర్‌ ఎస్‌.నారాయణ, డాక్టర్‌ రిచార్డ్‌ ఆశ, డాక్టర్‌ నిగమానంద బెహర, డాక్టర్‌ ఎస్‌.పూజ, డాక్టర్‌ శుభశ్రీ డాకువ, డాక్టర్‌ పి.సుచిత్ర పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement