ఖుర్దా రోడ్‌ రైల్వే స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఖుర్దా రోడ్‌ రైల్వే స్టేషన్‌ తనిఖీ

Jun 1 2026 1:08 AM | Updated on Jun 1 2026 1:08 AM

భువనేశ్వర్‌: తూర్పు కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ పరమేశ్వర్‌ ఫంక్వాల్‌ ఖుర్దా రోడ్‌ రైల్వే స్టేషన్‌ను సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్టేషన్‌ సదుపాయాలు, పరిశుభ్రత, క్యాటరింగ్‌ సేవలను సమీక్షించడంపై దృష్టి సారించారు. ఆయనతో ఖుర్దా రోడ్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ డి.సునీల్‌ పాల్గొన్నారు. తనిఖీ సందర్భంగా, పరమేశ్వర్‌ ఫంక్వాల్‌ బుకింగ్‌ కార్యాలయాలు, ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు, రాకపోకల ప్రాంతాలు, ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జ్‌లు, ప్లాట్‌ఫారాలు, క్యాటరింగ్‌ యూనిట్లతో సహా స్టేషన్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఆయన అధికారులతో మాట్లాడి స్టేషన్‌లో అందిస్తున్న ప్రయాణికుల సేవల నాణ్యతను సమీక్షించారు.

జనరల్‌ మేనేజర్‌ భద్రత, ప్రయాణికుల రద్దీ నిర్వహణ, పరిశుభ్రత, స్టేషన్‌ ప్రాంగణ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. పరిశుభ్రత, ప్రయాణికుల సౌకర్యాలు, వినియోగదారుల సంతృప్తి విషయంలో ఉన్నత ప్రామాణికలను పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ప్రయాణికుల సమస్యలను తక్షణమే, సమర్థంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సురక్షితమైన, సమర్థమైన, భద్రతతో కూడిన సౌకర్యవంతమైన రైల్వే సేవలను అందించడంలో నిరంతరం పర్యవేక్షించాలని జనరల్‌ మేనేజర్‌ తెలిపారు. ప్రయాణికుల కేంద్రీకత అభివృద్ధి, సేవా శ్రేష్టతపై దష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement