పర్లాకిమిడి: బీఎడ్ అడ్మిషన్ పరీక్ష 2026 ఆదివారం గజపతి జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాల్లో శాంతియుతంగా జరిగింది. గజపతి జిల్లా వ్యాప్తంగా 1339 అభ్యర్థులు బీఈడీ అడ్మిషన్ టెస్టుకు హాజరవ్వగా అందులో ఆర్ట్స్ అభ్యర్థులు 924, సైన్సు అభ్యర్థులు 415 మంది ఉన్నారు. పర్లాకిమిడిలో సెంచూరియన్ పబ్లిక్ స్కూల్, మహిళా కళాశాల, మహారాజా బాలుర ఉన్నత పాఠశాల, ఎం.ఆర్.గర్‌ల్స్ హైస్కూల్, సరస్వతీ శిశు మందిర్, శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాలలో బీఎడ్ పరీక్షలు నిర్వహించినట్టు డీఈఓ డాక్టర్ మయాధర్ సాహు తెలిపారు.


