గల్లంతైన వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన వ్యక్తి మృతి

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

యువతి ఆత్మహత్య..

రణస్థలం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కొమర లక్ష్మణ శనివారం చింతపల్లి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం రణస్థలం మండలంలోని కొవ్వాడ సముద్ర తీరంలో కొమర లక్ష్మణ మృతదేహం లభ్యమైంది. జే.ఆర్‌.పురం ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి కేసు నమోదు చేశారు.

పీఆర్‌ ఏఈ కృష్ణారావుకు సన్మానం

టెక్కలి: టెక్కలి డివిజన్‌ పంచాయతీరాజ్‌ ఏఈ కణితి కృష్ణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆత్మీయులు, అధికారుల సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణారావు, సుబ్బమ్మ దంపతులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ సూర్యప్రకాశ్‌, ప్రదీప్‌కుమార్‌, విశ్రాంత ఎస్‌ఈ కేఎంవీ ప్రసాదరావు, కేసీహెచ్‌ మహంతి, మురళీమోహన్‌, మందస, కంచిలి ఎంపీపీలు డి.దానయ్య, పి.దేవదాస్‌రెడ్డి, కంచిలి ఎంపీడీవో వి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం క్రైమ్‌: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో ఉంటున్న ఓ రూమ్‌లో ఫ్యాన్‌కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో రూమ్‌ తీసుకుని గ్రూప్‌–2,పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది. రూమ్‌ పక్కనే ఉన్న రీడింగ్‌ రూమ్‌కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్‌కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్‌లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్‌లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్‌లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్‌ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

వేడి నుంచి ఉపశమనం

మండే ఎండలు, ఉక్కపోతల నుంచి శ్రీకాకుళం నగర ప్రజలు స్విమ్మింగ్‌తో ఉపశమనం పొంతున్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్‌ కాలనీలో ఉన్న జిల్లా క్రీడాప్రాధికార సంస్థ స్విమ్మింగ్‌ పూల్‌ స్విమ్మర్లతో కిటకిటలాడుతోంది. ఉదయం, సాయంత్రం ఈత కొడుతూ సేదతీరుతున్నారు. వీరికి డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు.

– శ్రీకాకుళం న్యూకాలనీ

Advertisement
 
Advertisement
Advertisement