స్వర నివేదన | - | Sakshi
Sakshi News home page

స్వర నివేదన

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

● సంగీతంలో ఆకట్టుకుంటున్న చిన్నారులు ఆనందంగా ఉంది రేడియో ఆర్టిస్టుగా ఎదగాలని...

సంగీత సాధన..
● సంగీతంలో ఆకట్టుకుంటున్న చిన్నారులు

వేదికపై చిన్నారుల

ప్రదర్శన

సంగీతం అంటే నాకు ప్రాణం. గత నాలుగేళ్లుగా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రదర్శనలో పాడడం చాలా సంతోషంగా ఉంది.

– పి.కన్విత, 6వ తరగతి, శ్రీకాకుళం

శ్రీకాకుళం కల్చరల్‌: నగరంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆసక్తి మేరకు వేసవి నేపథ్యంలో పలు రకాల శిక్షణల్లో చేర్చుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా తమ పిల్లలకు సంగీతం నేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా నేర్చుకున్న చిన్నారులు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేస్థాయికి చేరుతున్నారు. స్థానిక బాపూజీ కళా మందిర్‌లో ఆదివారం శ్రీచరణి సంగీత కళాక్షేత్రంలో సంగీత సాధన చేసి.. పలువురు చిన్నారులు ప్రదర్శన ఇచ్చి తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు.

సంగీతంలో రేడియో గ్రేడ్‌ ఆర్టిస్టుగా ఎదగాలని కోరిక ఉంది. కష్టపడి గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇక్కడి వేదికపై ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది.

– పి.జాన్విత, ఇంటర్మీడియట్‌, శ్రీకాకుళం

Advertisement
 
Advertisement
Advertisement