తొలి మహిళా ఏడీసీగా అనన్య అవస్థి | - | Sakshi
Sakshi News home page

తొలి మహిళా ఏడీసీగా అనన్య అవస్థి

Jun 1 2026 1:02 AM | Updated on Jun 1 2026 1:02 AM

భువనేశ్వర్‌: ఐపీఎస్‌ అధికారిణి అనన్య అవస్థిని రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి ఎయిడ్‌ డి క్యాంప్‌ (ఏడీసీ)గా నియమించారు. ఈ ప్రతిష్టాత్మక పదవిలో పని చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ఆది వారం లోక్‌ భవన్‌లో జరిగిన లాంఛన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి, పోలీస్‌ ఏడీసీగా అనన్య అవస్థికి ఆమె కొత్త బాధ్యతలు స్వీకరణకు స్వాగతించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ సచివాలయం ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నియామకానికి ముందు అనన్య అవస్థి కటక్‌లోని యూపీడీలో అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ)గా పనిచేశారు. రాష్ట్ర గవర్నర్‌కు ఏడీసీగా పని చేసిన తొలి మహిళగా, ఆమె నియామకం ప్రభుత్వ సేవలో మహిళలకు ఒక ముఖ్యమైన మైలు రాయిగా నిలుస్తుంది. గవర్నర్‌కు గతంలో పోలీస్‌ ఏడీసీగా పని చేసిన ఐపీఎస్‌ అధికారి కులదీప్‌ మీనా స్థానంలో ఆమె నియమితులయ్యారు. రాష్ట్ర గవర్నర్‌కు ఇద్దరు ఎయిడ్స్‌ డి క్యాంప్‌లు (ఏడీసీలు) సహాయకులుగా ఉంటారు. వారిలో ఒకరు భారత నావికా దళం నుండి, మరొకరు ఒడిశా పోలీసుల నుండి ఉంటారు. అనన్య అవస్థి పోలీస్‌ ఏడీసీగా, భారత నావికా దళానికి చెందిన లెఫ్టినెంట్‌ హర్షిత్‌ దేవ్‌ గవర్నర్‌కు నావల్‌ ఏడీసీగా కొనసాగుతారు. అధికారిక కార్యక్రమాలు, ఉత్సవ కార్యక్రమాలు మరియు ఇతర ప్రోటోకాల్‌ సంబంధిత విధులలో గవర్నర్‌కు సహాయం చేయడంలో ఏడీసీ కీలక పాత్ర పోషిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement