రాయగడ: జిల్లాలో కాలవైశాఖి తుఫాను విషాదాన్ని మిగిల్చింది. గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలుల కారణంగా చెట్టు కూలి పంప్ హౌప్‌లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి మృతి చెందిన ఘటన జిల్లాలోని మునిగుడ సమితి కుట్రాగుడలో చోటు చేసుకుంది. మృతుడిని అదే గ్రామానికి చెందిన జితేంద్ర జాల్ (55) గా గుర్తించారు. పంప్‌హౌస్‌లో ఉద్యోగిగా విధులు నిర్వహించే జాల్ శుక్రవారం సాయంత్రం పంపులో నీళ్లు విడిచిపెట్టేందుకు వెళ్లే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో అక్కడ గల ఒక చెట్టు కిందకు విరిగి పడిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్నజాల్ పై చెట్టు పడిపోవడంతో తీవ్రగాయాలకు గురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
పారాదీప్ పోర్టులో ప్రమాదం
● డ్రైవర్ మృతి
భువనేశ్వర్: పారాదీప్ పోర్టులో సీక్యూ–1 బెర్త్ వద్ద శనివారం ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హైవా డ్రైవర్ మతి చెందాడు. బెర్త్‌లోని ప్లాట్ నుంచి హైవా ఇనుప ఖనిజాన్ని అన్‌లోడ్ చేస్తుండగా, క్రేన్ నుంచి దానిపై ఇనుప ఖనిజం పడటంతో డ్రైవర్ మరణించాడు. ఐపీటీ డంపర్ డ్రైవర్లు వివిధ ప్లాట్ల నుంచి పనిని నిలిపివేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
చోరీ కేసులో నిందితుల అరెస్టు
రాయగడ: జిల్లాలోని కాశీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన చోరీ కేసుకు సంబంధించి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ మేరకు వారి నుంచి చోరీకి గురైన సామాన్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభం
మల్కన్‌గిరి: ఒడిశాలో ఈ నెల 30వ తేదీ నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 28వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలేక్టర్ ప్రధమేశ్ అర్వింద్ రాజాశిర్క్ అన్నారు. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారన్నారు. ఈ క్రమంలో మల్కన్‌గిరి జిల్లాలో కూడా ఓటరు జాబితా కచ్చితత్వాన్ని నిర్థారించడం, అవసరమైన సవరణలు చేయడం కోసం ఈ ప్రక్రియ ప్రారంభించామన్నారు. ఓటర్ల వివరాల నవీకరణ, తప్పుల సవరణ, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు చేపట్టామన్నారు. జిల్లాలో రెండు నియోజకవర్గాలు మల్కన్‌గిరి, చిత్రకొండ ఉన్నాయని, ఈ రెండు చోట్ల మొత్తం 549 బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) వీరిలో మల్కన్‌గిరి నియోజకవర్గంలో 302 మంది, చిత్రకొండ నియోజకవర్గంలో 247 మంది ఉన్నారు. మల్కన్‌గిరిలో 2,52,691 మంది ఓటర్లు, చిత్రకొండలో 2,09,480 మంది ఓటర్లు ఉన్నారు. రెండు గణన ఫారాలను అందజేసి వాటిని ఎలా నింపాలో మార్గనిర్దేశం చేస్తారు. ప్రస్తుతం మల్కన్‌గిరి నియోజకవర్గంలో 2,36,078 మంది (93.43 శాతం) చిత్రకొండ నియోజకవర్గంలో 1,99,731 మంది (95.35 శాతం) 2002 ఓటరు జాబితాతో మ్యాపింగ్ చేశారు. మల్కన్‌గిరిలో 16,613 మంది, చిత్రకొండలో 9,749 మంది ఓటర్లు తమ గణన ఫారాలతోపాటు అవసరమైన పత్రాలను బీఎల్‌ఓలకు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేద్బ్‌ర్ ప్రధాన్, సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు.


