రాయగడ: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకుని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పితామహాల్ వద్ద గల సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌కు చెందిన బీఎస్సీ నర్సింగ్ నాలుగో సెమిస్టర్ విద్యార్థులు క్యాన్సర్ వార్డులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసన్ నిపుణుడు సురేష్ కుమార్ దేవ్ మాట్లాడుతూ.. పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, క్యాన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల గురించి వివరించారు. పొగాకు అలవాటు పూర్తిగా మానుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలని సూచించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి నర్సింగ్ విద్యార్థుఽలు పోస్టర్ల ద్వారా చైతన్యపరిచారు. క్యాన్సర్ వార్డులో చికిత్స పొందుతున్న 25 మంది రోగుల, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య సూచనలు అందించారు.


