పర్లాకిమిడి: స్థానిక వార్డు నంబర్ 5 జంగంవీధి ప్రజలు గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేనందున ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడటమే కాకుండా అనేక మంది పేషెంట్లు కరెంటు లేక అవస్థలు పడుతున్నారు. టాటా పవర్ డిస్ట్రిబ్యూషన్ జూనియర్ ఇంజినీరు, అసిస్టెంటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుకు జంగంవీధి వాసులు మొరపెట్టుకున్నా విద్యుత్ పునరుద్ధరణ నేటికీ జరగకపోవడంతో జంగం వీధి కూడలి వద్ద శనివారం మధ్యాహ్నం రెండు గంటలసేపు రాస్తారోకో ఆందోళన చేపట్టారు. దీంతో టి.పి.యస్.ఓ.డి.ఎల్. అసిస్టెంటు ఇంజినీరు, పోలీసులు వచ్చి ఏరియాలో విద్యుత్ పుణరుద్ధరణ చేస్తామని చెప్పటంతో జంగంవీధి వాసులు ఆందోళనను విరమించారు.


