జయపురం: జయపురం సబ్‌డివిజన్ అథ్లటిక్ అసోసియేషన్‌లో కోట్‌పాడ్ క్రీడాకారులకు సభ్యత్వం, ఓటువేసే హక్కు కల్పించాలని కోట్‌పాడ్ క్రీడా సంఘం, స్పోర్టింగ్ క్లబ్బు, యునైటెడ్ క్లబ్బుల సభ్యులు కోరారు. ఈ మేరకు కోట్‌పాడ్ ఎమ్లల్యే రూపు భొత్రను శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై వినతిపత్రాన్ని అందజేశారు. కోట్‌పాడ్ క్రీడాకారులను క్రీడా సంఘాన్ని సబ్‌డివిజన్ సంఘంలో కలిపేందుకు గతంలో ఆర్‌టీఐ సభ్యులు, కార్యదర్శి అనూప్ కమార్ పాత్రో కొరాపుట్ జిల్లా కలెక్టర్, క్రీడా విభాగ అధికారులను కలసి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల బరంపురం రెవెన్యూ డివిజనల్ కమిషనర్ అసోసియేషన్‌లో చేరాలనుకునేవారందరిని చేర్చుకొని వారికి ఓటు వేసే హక్కును కల్పించాలని జిల్లా కలక్టర్‌ను ఆదేశించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీనియర్ న్యాయవాది పంకజ పాత్రో, కిశోర్ చంధ్ర మిశ్రో, ప్రదీప్ కుమార్ బక్షీ,మహమ్మద్ సాలిమ్,సురేష్ మహంతి,వికాశ పట్నాయక్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి క్రీడాకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తాను సంబంధిత అధికారులు, కొరాపుట్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


