పిడుగుపాటుకు మూడు గదుల ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మూడు గదుల ఇల్లు దగ్ధం

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

భువనేశ్వర్‌: భద్రక్‌ జిల్లా తిహిడి మండలం దహపానియా గ్రామంలోని మూడు గదుల ఇల్లు పిడుగుపాటుకు దగ్ధమైంది. ఇంటిలో ఫర్నిచర్‌ అంతా కాలిపోయింది. లక్షల రూపాయల విలువైన ఆస్తి ధ్వంసమైందని బాధితులు వాపోతున్నారు.

చార్జీల పెంపుపై ప్రభుత్వానికి అల్టిమేటం

భువనేశ్వర్‌: బస్సు చార్జీల సవరణపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఒడిశా బస్సు యజమానుల సంఘం శనివారం రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. రాబోయే పది రోజుల్లోగా ప్రభుత్వంచార్జీల పెంపును ప్రకటించడంలో విఫలమైతే, రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులను నిలిపివేస్తామని సంఘం హెచ్చరించింది. శనివారం నిర్వహించిన సమా వేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి మీడియాకు అల్టిమేటం ఆవశ్యకతను వివరించారు. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులు, అధికం అవుతున్న కార్యాచరణ సవాళ్లను చార్జీల సవరణ కోరడానికి కీలక కారణాలుగా బస్సు యజమానులు పేర్కొన్నారు. చార్జీలు పెంచకపోతే బస్సులను నడపలేమన్నారు. ఈ సమస్య పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి గతంలో డీజిల్‌ చార్జీల పెంపు ఆధారంగా 13 కీలక అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం డీజిల్‌ ధరలలో కేవలం రెండు శాతం లెక్కన చార్జీల పెంపును మాత్రమే ఆమోదించింది. మిగిలిన అంశాలను పట్టించుకోలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఏ యజమాని కూడా తమ బస్సులను నడపడానికి సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో మరో వినతిపత్రాన్ని ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement