మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో కోరుకొండ పంచాయతీలో సర్పంచ్‌గా పద్మా మాడ్కామి ఉన్నారు. అయితే ఆమెకు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రిలో అటెండెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ విషయంపై జిల్లా పరిషత్ కార్యనిర్వహణ అధికారి దాశరఽథి సరాబు మాట్లడుతూ ఒక వ్యక్తి రెండు చోట్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేరని, ఆమె రాజీనామా చేయాలని తెలిపారు.
మల్కన్‌గిరి : జిల్లాలో రెండు రోజుల పాటు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ శిక్షణ అభియాన్ శిబిరాన్ని గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండ్ ప్రారంభించారు. ఈ శిబిరం లక్ష్యం బీజేపీ సంస్థను గ్రామీణ స్థాయిలో మరింత బలోపేతం చేయడం, వార్డు స్థాయి నుంచి కార్యకర్తలను మరింత చురుగ్గా తయారు చేయడం అని నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో ఎంపీ, ఎమ్మెల్యేలు అన్ని సమితుల కార్యకర్తలు శిక్షణ పొందారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలో వ్యూహాలపై శిక్షణ ఇచ్చారని నవరంగ్‌పూర్ ఎంపీ బోలభద్ర మాఝి అన్నారు. కార్యక్రమంలో మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సి్‌ంగ్ మడ్కమి, జిల్లా కార్యదర్శులు మాణిక్ లాల్ చక్రవర్తి, నవఘన లోకెయి తదితరులు హాజరయ్యారు.


