భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

రాయగడ: బక్రీద్‌ సందర్భంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మసీదుల్లో పత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, నెలకొనాలని ప్రార్థంచారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల నాయకులు ముస్లీంలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, త్యాగం, సహనం, మానవతా విలువలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ సమాజంలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. మస్లీం కుటుంబాలు ప్రత్యేక వంటకాలతో ఆనందంగా వేడుకలు నిర్వహించారు. చిన్నారులు నూతన వస్త్రాలు ధరించి సందడి చేశారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం పండగ ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రత చర్యలు తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement