జయపురం: జయపురం జమాల్ లైన్ శ్రీరామ మందిరం, మసీదు నిర్మాణాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు గురువారం జయపురం సబ్‌కలెక్టర్ జాదుమణి నాయక్ అధ్యక్షతన శాంతి సమావేశం జరిగింది. హిందూ, ముస్లిం వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. 107 ఏళ్ల కిందట శ్రీరామ మందిర పక్కన ముస్లిం సంప్రదాయ ప్రజలు ఉపాసన గృహం (మసీద్) నిర్మాణ కోసం 2023 నుంచి వివాదం ఏర్పడింది. సనాతన సంఘటనతో చేయబడిన ఆరోపణ ప్రకారం 103 యేళ్ల కిందట రామ మందిరం నిర్మించబడిందన్నారు. ఆ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం ఏర్పడవచ్చని పోలీసు అధికారి సబ్‌కలెక్టర్‌కు నివేదించారు. హింధూ ప్రతినిధుల ఆరోపణ ప్రకారం 1989లో శ్రీరామమందిర పక్కన స్థలం కొని మసీద్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. అందుచేత మసీద్ నిర్మాణం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతాన్ని మసీదుగా వినియోగం బంద్ చేయాలని, మాంసం వంటకంపై ఆంక్షలు విధించాలని, ముస్లింలు శ్రీరామ మందిరానికి సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ.. తాము పట్టణంలో సోదరత్వాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. అక్కడ ఏ ఒక్క మదర్సా లేరని, అలాగే మైకు వినియోగించటం లేదని, తాము మాంసం వండటం లేదని స్పస్టం చేశారు. ఉభయ పక్షాల వాదనలను విన్న జయపురం సబ్‌కలెక్టర్ జాదుమణి నాయక్, జయపురం తహసీల్దార్ సవ్య సాయి జేన, పట్టణ పోలీసు అధికారి .. శ్రీరామ మందిర్, మసీదు ఉన్న స్థలాలను సందర్శించారు. ఉభయ పక్షాల వివరణతో తాము జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తేజేశ్వర పండా, బును రథ్, గంగాధర నాయక్, ఆర్.ఎస్.ఎస్ నేత డాక్టర్ నిరంజన్ మిశ్ర, పి.నాగు, ముస్లిం ప్రతినిధులు హసన్ మదాని, ముస్లి్‌ం మత గురువులు పాల్గొన్నారు.


