జయపురం: జయపురం సబ్‌డివిజన్‌లో రబీ సీజన్ ధాన్యం సేకరణపై రైతులను చైత్యపరచేందుకు గురువారం అధికారులు మూడు రైతు చైతన్య రథాలను ప్రారంభించారు. జయపురం సబ్ కలెక్టర్ జాదుమణి నాయ రథాలను ప్రారంభించారు. ఈ సచేతన రథాలు జయపురం సబ్ డివిజన్‌లో వివిధ సమితులు మునిసిపాలిటీలలో పర్యటించి రైతులను సచేతలను చేస్తాయని సబ్‌కలెక్టర్ వెల్లడించారు. రైతులు టోకెన్లు అధికారుల నుంచి తీసుకొని ధాన్యాన్ని పరిశుభ్రపరచి, ఎఫ్‌ఎక్యూ నాణ్యత పరిశీలించిన తరువాత ధాన్యాన్ని మండీలకు తీసుకురావాలన్నారు. ప్రతి మండీలోనూ రైతుల కోసం అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా తాగునీటి సైకర్యం, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, విద్యుత్ సౌకర్యం, రైతులు నీడలో ఉండేందుకు టెంట్‌లు ఏర్పాటు చేయటంన దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. రైతులు మంచి ధాన్యం మండీలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ఈ రైతు సచేతన రథం జయపురం మునిసిపాలిటీ, కొట్‌పాడ్ నోటిఫైడ్ ఏరియా(ఎన్.ఎ.సి) ప్రాంతం, జయపురం సమితి, బొరిగుమ్మ సమితి, కొట్‌పాడ్ సమితి, కుంద్ర సమితి, బొయిపరిగుడ సమితుల్లోని గ్రమాల్లో పర్యటించి రైతులకు ధాన్యం సేకరణ, నిబంధనలపై అధికారులు కల్పించే సౌకర్యాలపైన వివరించి చైతన్య పరుస్థామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెగ్యులేటింగ్ మార్కెట్ కమిటీ కార్యదర్శి తుషార్ కాంతి శెట్టి, ఆర్.ఎం.సి అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.


