నవీన గుప్తకు అభినందన | - | Sakshi
Sakshi News home page

నవీన గుప్తకు అభినందన

May 29 2026 2:31 AM | Updated on May 29 2026 2:31 AM

జయపురం: ఒడిశా పబ్లిక్‌ అడ్మినిస్ట్రేట్‌ సర్వీస్‌ పరీక్షలో (ఓ.ఎ.ఎస్‌) కొట్‌పాడ్‌ యువకుడు నవీన గుప్త 19వ ర్యాంక్‌ సాధించి సత్తాచాటాడు. ఈ విషయం తెలుసుకున్న కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే రూపు భొత్ర నవీన గుప్త ఇంటికి గురువారం వెళ్లి అభినందించారు. వెనుకబడిన ప్రాంతం నుంచి యువకుడు 19వ ర్యాంకులో ఉత్తీర్ణుడు కావటం కొట్‌పాడ్‌కే గర్వకారణం అన్నారు. నవీన గుప్త సాధించిన విజయాన్ని ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా ఫ్లడ్‌లైట్లు

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన క్రికెట్‌ నెట్స్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లా క్రికెట్‌ సంఘం రూ.17లక్షల నిధులను వెచ్చించిన ఈ నెట్స్‌ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆకర్షిస్తోంది. ఇందులోకి పశువులు, ఇతరులు/అపరిచితులు లోపలకు ప్రవేశించుకుండా రక్షణగా ఇనుప కంచె సైతం అమర్చారు. ప్రస్తుతం రక్షణ వలయంలో క్రీడా కారులు ముమ్మర సాధన చేస్తున్నారు. జెడ్‌సీఎస్‌ ప్రతినిధులు, కోచ్‌లు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement