అరణ్య రోదన.. | - | Sakshi
Sakshi News home page

అరణ్య రోదన..

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో ఓ యువకుడికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రతిభావంతుడైన ఆ యువకుడు క్యారెక్టర్‌ సర్టిఫికేట్‌ కోసం పోలీసులను సంప్రదిస్తే అతనిపై అప్పటికే గంజాయి కేసు నమోదై ఉన్నట్లు తేలింది. గంజాయి సేవిస్తున్నట్లు వీడియోలు కలకలం సృష్టించిన ఘటనలో ఆ యువకుడు గతంలో పోలీసులకు చిక్కడంతో కేసు నమోదు చేశారు. సరదా, సందడి కోసం చేసిన ఆ పని యువకుడి జీవితంపై తీరని మచ్చగా మిగిలింది. అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గంజాయి సేవనం వల్ల దూరమైంది. ఆ యువకుడు జీవితం అంధకారబంధురమైంది.

Advertisement
 
Advertisement
Advertisement