ఘనంగా గ్రామదేవత ఉత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా గ్రామదేవత ఉత్సవాలు

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

ఘనంగా గ్రామదేవత ఉత్సవాలు ఘనంగా అమ్మవారి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో రమా సత్యనారాయణ వ్రతం

పర్లాకిమిడి: స్థానిక ఎనిమిదో వార్డు పరిధి పిన్నింటి పాపన్న వీధిలో జరుగుతున్న గ్రామ దేవత ఉత్సవాలు చివరిరోజు బుధవారం పట్టణంలో ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి పాల్గొ అమ్మవారి ఘటాన్ని మోశారు. కమిటీ సభ్యులు, బీజేడీ శ్రేణులు న్యృం చేశారు.

పర్లాకిమిడి: గుసాని సమితి బుసుకిడి పంచా యతీ లింగుపురంలో జరుగుతున్న చింతపోల మ్మ అమ్మవారి ఉత్సవాలకు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణ రావు విచ్చేసి ఘటాలు మోశారు. ఆయనతో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు సనప ల కిరణ్‌కుమార్‌, గ్రామ వ్యాపారవేత్త సిద్ధార్థ, డైరెక్టర్‌ ఆర్‌.ఎం.సి బల్ల ధనుంజయ, మాజీ జెడ్పీటీసీ శ్రీధర్‌ నాయుడు, జగన్నాథ పరిడా, తదతరులు పాల్గొన్నారు.

రాయగడ: స్థానిక బాలాజీనగర్‌లో గల కళ్యాణవేంకటేశ్వర మందిరంలో అధిక జ్యేష్ఠ మాసం శుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తిశ్రద్ధలతో రమాసత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో బుధవారం జరిగాయి. ఈ పవిత్ర రోజున ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించా రు. ఉదయం నుండే భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చారు. వేదపండితులు రమా సత్య నారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు ఉపవాస దీక్ష ఆచరిస్తే కుటుంబ శ్రేయ స్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలుగుతాయని ప్రధాన అర్చకులు భాస్కరాచార్యు లు ఈ సందర్భంగా వివరించారు.

29,30 తేదీల్లో ఎస్సీ కమిషన్‌ సభ్యుడి పర్యటన

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) కమిషన్‌ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. మధ్యాహ్నం పలు భూ సమస్యల పై క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. 30న ఉదయం 10:30 గంటలకు మందస తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని ఎస్సీ ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం భూవివాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడతారు.

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

నరసన్నపేట: త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఒక ప్రకటనలో కోరారు. దానం చేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండగ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: బక్రీద్‌ పండగ మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని.. కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్‌ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సంద ర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్య లు చేపట్టాలని ఆదేశించారు. మసీదుల వద్ద బందోబస్తు, డ్రోన్స్‌, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement