బతుకుల్ని బలిచేస్తున్న గంజాయి | - | Sakshi
Sakshi News home page

బతుకుల్ని బలిచేస్తున్న గంజాయి

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

శ్రీకాకుళం క్రైమ్‌:

గంజాయి మత్తులో జిల్లా యువత చిత్తవుతున్నారు. ఏం చేస్తున్నారో సోయి లేనంతగా ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఎదురున్నది సామాన్య ప్రజలా.. పోలీసులా..అన్నది వీరికి అనవసరం.. ఎవరిని కొట్టాలో.. ఎవరిని హత్య చేయాలో.. ఎవరిపై అఘాయిత్యం జరపా లో వారే లక్ష్యంగా కనిపిస్తారు. ఖర్చులకు డబ్బు లు లేకపోతే నిర్మానుష్య మార్గాల్లో రాత్రివేళల్లో ఒంటరిగా వచ్చేవారిని అడ్డగిస్తారు. దారి దోపిడీ లు చేస్తారు. అవసరమైతే నగల కోసం గొంతుక లను సైతం కోయడానికి వెనకాడరు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనడానికి ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలే నిదర్శనం. గంజాయి మత్తు యువత జీవితాన్ని ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతోందనడానికి కొందరి జీవితాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.

గంజాయి మత్తుతో యువత బతుకు చిత్తు

జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా

పల్లెలకూ విస్తరిస్తున్న జాఢ్యం

Advertisement
 
Advertisement
Advertisement