పర్లాకిమిడి: పెట్రోల్, డీజిల్, సి.ఎన్.జీ, గ్యాస్ ధర ల పెరుగుదలకు నిరసనగా బుధవారం సాయంత్రం జంగంవీధి కూడలి వద్ద ఉన్న ఆర్.ఎం.సి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద బీజేడీ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పదిరోజుల్లో మూడు సార్లు చమురు ధరలు పెంచడం పట్ల జిల్లా బీజేడీ అధ్యక్షుడు ప్రదీప్ నాయక్ విమర్శించారు. పెట్రో ధరలు పెరగటంతో మార్కెట్‌లో అన్ని నిత్యావసర ధరలు ఆకాశానికి పెరిగిపోయాయన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కారు పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా రు. రోడ్డుకు అడ్డంగా టైర్లు కాల్చి నిరసన తెలిపా రు.
ఈ ఆందోళనలో బీజేడీ యువజన అధ్యక్షుడు లెంక సిమ్మ, మహిళా అధ్యక్షురాలు సంయుక్తా బెహరా, బీజేడీ నాయకులు బిశ్వజిత్ త్రిపాఠి, బీజేడీ టౌన్ అధ్యక్షుడు సిత్తు మహాపాత్రో, బీజేడీ కౌన్సెలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.


