విద్యుత్‌ షాక్‌తో మేసీ్త్ర మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో మేసీ్త్ర మృతి

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

విద్యుత్‌ షాక్‌తో మేసీ్త్ర మృతి

రాయగడ: జిల్లాలో ఆవాస్‌ గృహ నిర్మాణ పనులు జరుగుతుండటంతో విద్యుత్‌ తీగలు తాకడంతో షాక్‌కు గురై ఓ మేసీ్త్ర ప్రాణాలు కోల్పొయాడు. మృతుడు కళహండి జిల్లా లంజిఘడ్‌ సమితి పరిధిలోని డంగాముండి గ్రామానికి చెందిన లఖన్‌ మాఝి (49)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డంగాముండి గ్రామానికి చెందిన ఇంద్ర మాఝి నిర్మిస్తున్న ఆవాస్‌ ఇంటి పైకప్పు పనుల్లో లఖణ్‌ మయాఝి రాడ్‌ బెండింగ్‌ పనులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ లైన్‌ తగలడంతో లఖణ్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపొయాడు. తోటివారు గమనించి వెంటనే కళ్యాణసింగుపూర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలని బాధిత కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement