విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో
రాయగడ: జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో పిలుపునిచ్రరు. స్థానిక బిజూపట్నాయక్ ఆడిటోరియంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు టి.గొపిఆనంద్ ఆధ్యక్షతన బుధవారం పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం, కార్యకర్తల విస్తరణ, గ్రామీణ స్థాయిలోకి పార్టీని తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని సమితులు, పంచాయతీలకు చెందిన పార్టీ కార్యకర్తలు శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ వాద సిద్ధాంతాలు, పార్టీ ఆదేశాలు, విధానాలను గ్రామస్థాఽయి నాయకులు, కార్యకర్తలు సమర్ధవంతంగా చేరవేయడ ఎలా వివరించారు. కార్యక్రమంలొ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ చంద్ర సాహు, సీనియర్ నాయకులు కాళీరాం మాఝి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు కొరాడ రజిత, జిల్లా కార్యదర్శి పృధ్వీరాజ్ ధనపతి, జిల్లా మాజీ అధ్యక్షుడు శివకుమార్ పట్నాయక్ , శివశంకర్ ఉలక ఉన్నారు.


