భువనేశ్వర్ : బ్లాక్ పగోడాగా ప్రఖ్యాతిగాంచిన అర్క క్షేత్రం కోణార్క్ సూర్య దేవాలయం ప్రాంగణంలో 108 రౌండ్ల సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం జరగనుంది. ఓం ఫ్రీ యోగా సంస్థ ఆధ్వర్యంలో జూన్ 14న ఈ కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షుడు, యోగా మాస్టర్ డాక్టర్ చిలుకా వెంకట రమేష్ తెలిపారు. యోగాకు విస్తత ప్రచారం కల్పించడంలో భాగంగానే ప్రఖ్యాత దేవాలయాల ఆవరణలో యోగాసనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో నిర్వాహక సంస్థ ప్రతినిధులు రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు. కార్యక్రమంలో ఓం శ్రీ యోగ సంస్థ అధ్యక్షులు శాంతారాం, బీజేపీ విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీందర్, ఉపాధ్యక్షుడు సురేష్ బాబు, లెండి విద్యాసంస్థల ఛైర్మన్ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.


