మహేంద్రగిరిపై విశ్వ కల్యాణం | - | Sakshi
Sakshi News home page

మహేంద్రగిరిపై విశ్వ కల్యాణం

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

● భాస్కరతీర్థ లక్ష్మీబాబా

● భాస్కరతీర్థ లక్ష్మీబాబా

పర్లాకిమిడి: మహేంద్రగిరి పర్వతంపై జూన్‌ ఒకటి నుంచి తొమ్మిదో తేదీ వరకూ విశ్వకల్యాణాన్ని (మహేంద్రమేళా) నిర్వహిస్టున్నట్టు మహేంద్రగిరి సురక్షా మంచ్‌ నాయకులు, భాస్కరతీర్థ లక్ష్మీబాబా వెల్లడించారు. మేళాను అడ్డుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే ఎన్ని అడ్డంకులు ఏర్పడినా ఈ పవిత్ర విశ్వ కల్యాణాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. స్థానిక పెద్ద రాధాకాంత మఠంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబా మాట్లాడారు. పురుషోత్తమాసం సందర్భంగా పరశురాం కుండ్‌ వద్ద యజ్ఞాలు, సంకీర్తన, భజన కార్యక్రమాలకు జగద్గురు నరేంద్ర సరస్వతీ తీర్థ విచ్చేసి మూడు రోజులు బసచేస్తారని అన్నారు. అయితే పూరీ క్షేత్రం గోవర్ధనగిరి శంకరాచార్యులు మాత్రం అనారోగ్యం కారణంగా మహేంద్రం రావడం లేదని అన్నారు. ఈ విశ్వకళ్యాణం వల్ల ఈ ప్రాతం సుభిక్షమై పంటలు పండటమే కాకుండా సమృద్ధిగా వర్షాలు కురిసి శాంతి చేకూరుతుందని అన్నారు. మహేంద్రగిరి మేళాకు అనేకమంది గురువులు, మండళి మహాంతలు, సాధుసంతవులు ద్వారా పుణ్యస్నాణాలు, యాజ్ఞాదులు, దానాలు జరుగుతాయని అన్నారు. విలేకరుల సమావేశంలో బ్రహ్మాలోకానంద, సత్యన్నారాయణ దాస్‌ పాల్గొన్నార.

Advertisement
 
Advertisement
Advertisement