భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత మాధ్యమిక విద్యా మండలి ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో మేటి ఉత్తీర్ణత సాధించిన హై టెక్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ చిత్తరంజన్ సహాణి మాట్లాడుతూ విద్యార్థులు తమ చదువును నిరంతరం కొనసాగిస్తే విజయం వారి చేతుల్లోనే ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా హైటెక్ సైన్స్ అండ్ కామర్స్ కళాశాల డైరెక్టర్ అంకితా పాణిగ్రాహి విద్యార్థుల భావి జీవితం అడుగడుగున విజయాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ముఖ్య కార్యనిర్వహణాధికారి శక్తిమయి పాఽఢి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఉత్తీర్ణత ప్రేరేణతో అందమైన జీవితాన్ని ఆవిష్కరించుకోవాలని కోరారు. మేధావంతులైన విద్యార్థులు దేశం సమగ్ర సంక్షేమానికి కృషి చేయాలని వైస్ చైర్మన్ బిభూతి భూషణ్ బెహరా ప్రోత్సహించారు. అంకితభావంతో విద్యార్థులు బహుముఖ రంగాల్లో మేటి ఉత్తీర్ణులు కావాలని ఉత్సాహపరిచారు. హై టెక్ సైన్‌న్స్ అండ్ కామర్స్ కళాశాల గత 20 ఏళ్లుగా 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తుంది. ఈ సంవత్సరం అదే తరహాలో ఉత్తీర్ణులైన వారిలో 97 శాతం మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కాగా నామమాతంగా 5 మంది విద్యార్థులు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు.


