కలెక్టర్‌కు పాచిపోయిన ఆహారం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌కు పాచిపోయిన ఆహారం

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

కొరాపుట్‌: సాక్షాత్తు కలెక్టరే పాచిపోయిన ఆహారం తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నబరంగ్‌పూర్‌ కలెక్టర్‌ మహేశ్వర్‌ స్వయ్‌ రాయిఘర్‌ సమితి కేంద్రం సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సమీక్ష సమావేశంలో సిబ్బంది బయట హోటల్‌ నుంచి అల్పాహారం తెప్పించి ఇచ్చారు. అది పాచి పోయిన విషయం హాటల్‌ విక్రేతలు చెప్పలేదు. అలాగే సిబ్బంది కూడా పరిశీలించలేదు. తిన్న కలెక్టర్‌ ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఆహారం ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీశారు. బయట హోటల్స్‌లో అమ్ముతున్నారని తెలుసుకుని వెంటనే ఫుడ్‌ సేఫ్టీ, తహసీల్దార్‌, పోలీసు విభాగాల సిబ్బందితో రాయిఘర్‌లో హోటల్స్‌పై దాడులు చేయించారు. ఆయా హోటల్స్‌లో దారుణమైన కలుషిత ఆహారాలు కనిపించాయి. దాంతో రెండు హోటల్స్‌ సీజ్‌ చేశారు. మిగతా హోటల్స్‌పై జరిమానాలు విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement