రాష్ట్రంలో అత్యాచారాలు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అత్యాచారాలు అరికట్టాలి

May 27 2026 12:53 AM | Updated on May 27 2026 12:53 AM

పర్లాకిమిడి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని, కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ఉద్దేశపూర్వకంగా డీ–లిమిటేషన్‌ బిల్లుతో లింకు పెట్టడం వల్ల లోక్‌సభలో వీగిపోయిందని బీజేడీ మహిళా అధ్యక్షురాలు సంయుక్తా బెహరా అన్నారు. స్థానిక బిజూ కల్యాణ మండపం నుంచి బీజేడీ పార్టీ తరపున మహిళలంతా ర్యాలీని చేపట్టారు. మహిళలంతా పెద్ద ఎత్తున కలెక్టరేట్‌ కార్యాలయం వరకూ వెళ్లి నిరసన తెలిపారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళలకు భద్రత కల్పించాలని పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మలా శెఠి అన్నారు. అనంతరం రాష్ట్రపతికి విన్నవిస్తూ కలెక్టర్‌ అక్షయ సునీల్‌ అగర్వాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రూపేష్‌ పాణిగ్రాహి, బీజేడీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్‌ నాయక్‌, జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, పురపాలక సంఘం చైర్మన్‌ నిర్మలా శెఠి, గుమ్మాబ్లాక్‌ అధ్యక్షురాలు సునేమీ మండల్‌, కాశీనగర్‌ బ్లాక్‌ అధ్యక్షురాలు బల్ల శాయమ్మ, కాశీనగర్‌ ఎన్‌ఏసీ మాజీ వైస్‌ చైర్మన్‌ రఘురాం సాహు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement