న్యూస్‌రీల్
మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026
మహారాజా కృష్ణచంద్ర గజపతికి..
పర్లాకిమిడి: పర్లాకిమిడి మహారాజా కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ 53వ సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా సోమవారం జరుపుకున్నారు. కుమ్మరి వీధి వద్ద మహారాజా శ్మశాన వాటిక వద్ద ఆయన స్మృతి పీఠానికి ముఖ్యఅతిథి, ఏడీఎం మునీంద్ర హానగ జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు గజపతి వంశం చివరి రాణి కళ్యాణి గజపతి హాజరై తన తాతకు స్మృతి అంజలి ఘటించారు. అలాగే పట్టణంలో పాతబస్టాండు వద్ద మహారాజా విగ్రహానికి పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి పూలమాలు వేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్తు సి.డి.ఓ. దయామయపాఢి, పురపాలక సంఘం ఈ.ఓ. లక్ష్మణ ముర్ము, జిల్లా సాంస్కృతిక అధికారిని అర్చనా మంగరాజ్, డీపీఆర్‌ఓ ప్రదిప్త గురుమయి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ సంస్మరణ
మహారాజా కృష్ణచంద్రగజపతి నారాయణ దేవ్ 52వ వర్ధంతి సందర్భంగా స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో నిరాడంబరంగా సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో వున్న గజపతి విగ్రహానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు దుర్గాసి శ్రీరాంమూర్తి, జిల్లా ఉన్నత పాఠశాలల క్రీడాధికారి సురేంద్ర కుమార్ పాత్రో, జగన్నాధ పట్నాయిక్, సోమనాథ్ దాస్ తదితరులు నివాళులర్పించారు.


