జయపురం: స్థానిక విక్రమ స్టేడియం మైదానంలో జయపురం ప్రీమియర్ లీగ్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాంపియన్‌గా జయపురం రాయల్స్ జట్టు విజయం సాధించి చాంపియన్ షీల్డ్ గెలుచుకుంది. పట్టణంలో ప్రముఖ వ్యాపారి సుభాష్ రౌత్ టాస్ వేసి ఫైనల్ ఆటను ప్రారంభించారు. టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరిన జయపురం రాయల్ జట్టు, సన్‌సైన్ సూపర్‌కింగ్స్ టీమ్‌లు తలపడ్డాయి. రాయల్ టీమ్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 192 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సన్‌సైన్ సూపర్‌కింగ్స్ టీమ్ చక్కగా ఆడినా రాయల్ టీమ్ ఆటగాళ్ల దాటికి నిలువలేక పోయింది. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 168 పరుగులు మాత్రం చేయగలిగి ఓటమి చవిచూచింది. 24 పరుగుల ఆధిక్యతతో రాయల్స్ టీమ్ చాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధాన ఉత్సవంలో అతిథులుగా సుభాష్ రౌత్, బాబుల రౌత్ పాల్గొన్నారు. ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా రాయల్ టీమ్ ఆటగాడు భాగేష్ శర్మ ఎంపికయ్యారు. ఉత్తమ ఫీల్డర్‌గా దిలీప్ కుమార్ స్వయ్, ఆదిత్య అభిషేక్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అర్జున మాల్య, ఉత్తమ కెప్టెన్‌గా జి.కృష్ణ ఎంపికయ్యారు. చాంపియన్ టీమ్‌కు ఒక లక్ష 50 వేల నగదు అందించారు. రన్నరప్‌కు రూ.లక్ష నగదుతోపాటు షీల్డ్ అందజేశారు.


