బీజేడీ నేతల ఆరోపణ
జయపురం: ప్రధానమంత్రి రోజ్‌గార్ ఆవాస్ యోజనతోపాటు వివిధ పథకాల్లో లబిధదారులకు చెందాల్సిన రూ. 50 కోట్లను పోస్టుల్‌శాఖ ఉద్యోగులు పక్కదారి పట్టించి అవినీతికి పాల్పడ్డారని బీజేపీ పార్టీ నాయకులు ఆరోపించారు. జయపురంలోని ఓ హోటల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి రబినారాయణ నందో, పార్లమెంటు మాజీ సభ్యులు ప్రదీప్ మఝి, పార్టీ యువజన ఉపాధ్యక్షులు అరుణ కుమార్ మిశ్ర, కొరాపుట్ జిల్లా కార్యక్రారి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ మిశ్ర, సీనియర్ నాయకులు సరోజ్ కుమార్ పాత్ర, ధర్మేంద్రఅధికారి మాట్లాడారు. జయపురం ప్రధాన పోస్టాఫీసు ఆధీనంలో కొరాపుట్, మల్కన్‌గిరి, రాయగడ, నవరంగపూర్ జిల్లాలు ఉన్నాయని ఆయా పోస్టాఫీసుల్లో ప్రధాన మంత్రి అవాస్ యోజన తదితర పథకాల లబ్ధిదారులకు చెందిన 50 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందన్నారు. తపాలా విభాగంలో బీవీజీ రాంసింగ్, ప్రధాన మంత్రి అవాస్ యోజన, వృద్ధాప్య పింఛన్లు, బీమా మొదలగు ప్రజా సంక్షేమ పథకాల లబ్ధదారులకు పైకం జమ చేయాల్సి ఉంటుందన్నారు. అయితే కొరాపుట్, నవరంగపూర్ జిల్లాలలో డాబుగాం, ఝోరిగాం, కొడింగా తదిర సమితిలలో 800 తపాలా కార్యాలయాలలో ఉద్యోగులు కొంతమంది సబ్ తపాలా ఉద్యోగులు కలసిపేద లబ్ధిదారులకు చెందాల్సిన రూ. 50 కోట్లు స్వాహా చేశారని రోపించారు. 2021 నుంచి 2026 వరకు దాదాపు 25 వేల మంది అసలైన ఉపాధి హామీ పథకం వేతనదారులకు వేతనాలు ఇవ్వకుండా వారి ఖాతాల కేవైసీలను అక్రమంగా మార్చి నకిలీ వేలి ముద్రలు వేసి వారికి చెందాల్సిన సొమ్మును స్వాహా చేసినట్లు నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపి అవినీతి అధికారులు సిబ్బందిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే లబ్ధిదారులకు చెందాల్సిన పైకాన్ని వారికి వెంటనే చెల్లించాలని.. లేకపోతే పీఎంజీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అలాగే తాము న్యాయం కొరకు న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ మంత్రి రబినారాయన నందో, మాజీ ఎంపీ ప్రదీప్ మఝి స్పష్టం చేశారు.


