నకిలీ నంబర్‌ ప్లేట్‌తో గంజాయి అక్రమ రవాణా | - | Sakshi
Sakshi News home page

నకిలీ నంబర్‌ ప్లేట్‌తో గంజాయి అక్రమ రవాణా

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

రాయగడ: బోలేరో వాహనానికి నకిలీ నంబర్‌ ప్లేట్‌ అమర్చి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా సదరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ జెన్న బృందం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఒక బొలేరో వారికి హైవే వద్ద తారస పడింది. అనుమానించిన పోలీసులు దానిని ఆపి తనిఖీ చేయగా అందులో గంజాయి పట్టుబడింది. అయితే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వాహనంలో ఉన్న 230 కిలోల గంజాయితోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరించారు. బొలేరోకు అమర్చిన నంబరు ప్లేట్‌ నకిలీదని పోలీసులు దర్యాప్తులో తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నప్పుడు పోలీసులు సోమవారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement