మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి గుంటాబేడ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రధమేశ్ అర్వింద్ ఆధ్వర్యంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించి 50 వినతులు స్వీకరించారు. 5 వ్యక్తిగత ఫిర్యాధులు, 45 గ్రామస్థాయి సమస్యలపై ఫిర్యాధులు అందాయి. వీటిలో పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను ఆయా శాఖలకు అప్పగించారు. మధుబాబు పెన్షన్ పథకం, వృద్ధాప్య, వితంతు భత్యాల కోసం కొత్త దరఖాస్తులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పక్కా ఇళ్ల మంజూరు, కొత్తరేషన్ కార్డుల జారీ కోసం వినతులు అందాయి. వివిధ గ్రామాల ప్రతినిధులు గ్రామీణ రహదారుల నిర్మాణం, తాగునీటి సరాఫరాలో సమాస్యలు, విద్యుదీకరణలో లోపాలు, భూపట్టాల మంజూరు వంటి కీలక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అభివృద్ధి శాఖ అధికారి దశరాథి సరాబు, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధర్ బోయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మల్కన్‌గిరి సమితిలో సీంద్రీమాల పంచాయతీ, మాత్తిలి సమితి కర్తన్‌మాల, కలిమెల గుమాక పంచాయతీ, ఖోయిర్‌పూట్ సమితి ముదిలిపోడ, కోరుకొండ సమితి డుడుమేట్ల పంచాయతీలోనూ వినతులు స్వీకరించారు.
పర్లాకిమిడి: గజపతిజిల్లా రాయఘడ బ్లాక్ పంచాయతీ సమితి కార్యాలయంలో సోమవారం గ్రామముఖిపరిపాలన, జాయింట్ గ్రీవెన్స్‌కు అధిక స్పందన లభించింది. గ్రీవెన్స్‌కు జిల్లా కలెక్టర్ అక్షయసునీల్ అగర్వాల్, ఎస్.డి.పి.ఒ మాధవానంద నాయక్, డీఎఫ్‌ఓ నాగరాజు, ఐ.టి.డి.ఏ.పి.ఓ అంశుమాన్ మహాపాత్రో, సబ్‌కలెక్టర్ అనుప్ పండా, రాయఘడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్ తదితరులు పాల్గొన్నారు. 18 వినతులు అందాయి. వీటిలో గ్రామ సమస్యలు 15, వ్యక్తిగతం 3 ఉన్నాయి. జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం ఆధ్వర్యంలో ఆరుగురుకి మధుబాబు పింఛన్లు అందజేశారు. అధిక ఎండలు కారణంగా గ్రీవెన్సు సెల్‌కు అతి తక్కువ అభియోగాలు వచ్చాయి. ఇతర ప్రభుత్వ అధికారులతోపాటు ఉపాధ్యక్షులు జ్యోతిరంజన్ పాణి, బి.డి.ఓ సంతోష్‌కుమార్ బారిక్, తహసీల్దార్ సుకాంత ప్రధాన్, తదితరులు పాల్గొన్నారు.


