70 మొబైల్‌ ఫోన్ల బాక్సు మాయం | - | Sakshi
Sakshi News home page

70 మొబైల్‌ ఫోన్ల బాక్సు మాయం

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

● పోలీసులకు ఫిర్యాదు

● పోలీసులకు ఫిర్యాదు

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లాలో ప్రైవేట్‌ బస్సుల్లో నిర్లక్ష్యం, ఇష్టరాజ్యం ప్రయాణికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. సరైన సీట్లు ఇవ్వకపోవడం, అఽధిక చార్జిలు వసూలు చేయడం వంటి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు బస్సులో పార్సెల్‌ రూపంలో పంపిన 70 మొబైల్‌ పెట్టె మాయమైన ఘటన ఇప్పుడు చర్చనీయమైంది. మాయమైన ఫోన్ల విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుంది. ఈ మేరకు మల్కన్‌గిరి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఐఐసీ రీగాన్‌ కీండో కేసు నమోద్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వర్‌ నుంచి మల్కన్‌గిరికి రోజూ మహదేవ్‌ పేరుతో ప్రైవేటు బస్సు వస్తుంది. దీనికి ఽభువనేశ్వర్‌లో సెల్‌ఫోన్లతో ఉన్న పార్శిల్‌ ఇచ్చారు. భువనేశ్వర్‌కు చెందిన డిలైట్‌ డిస్ట్రిబ్యూటర్‌ సంస్థ మల్కన్‌గిరికి చెందిన డిజిటల్‌ వరల్డ్‌ సంస్థకు 70 మొబైల్‌ ఫోన్లు ఒక పెట్టెలో ప్యాక్‌ చేసి బస్సుకు ఇచ్చారు. బస్సు సోమవారం చేరుకున్న వెంటనే సంబంధిత వ్యక్తులు రశీదు చూపించి మొబైళ్ల బాక్సు కోసం సిబ్బందిని అడిగారు. అయితే బాక్సు లేకపోవడంతోపాటు బస్సు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో డిజిటల్‌ వరల్డ్‌ యజమాని మౌసమీ సాహా దీనిపై స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ బస్సుపై గతంలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement