రోగులకు మెరుగైన సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

రోగులకు మెరుగైన సేవలందించాలి

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి

జయపురం: అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు మైరుగైన చికిత్స అందించాలని జయపురం ఎమ్లల్యే తారాప్రసాద్‌ బాహిణీపతి అన్నారు. జయపురం జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన రోగులకు అందుతున్న సేవలు సేవ, వివిధ విభాగాల పనితీరుపై సమీక్షించారు. ఆస్పత్రిలో నెలకున్న సమస్యలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, సముచిత వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అమర్యాదగా ప్రవర్తించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన ఆస్పత్రిలో కలియతిరుగుతూ రోగులను పరామర్శించి వారి బాగోగులు తెలుసుకున్నారు. సమావేశంలో ప్రధాన వైద్యులు లక్షయ కుమార్‌ రథ్‌, రమాకాంత, భిభుతి భూషణ జెన, గైతమ త్రిపాఠీ, దుర్గా ప్రసాద్‌ పాత్రో, ఆశిష్‌ కుమార్‌ పాణిగ్రహి, లక్ష్మీపాత్రో, ఆస్పత్రి మేనేజర్‌ రనూపిసీ నాయిక్‌, సపణ పాణిగ్రహి, తదాగత దాస్‌, బి.జయబాబు, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement