వైభవంగా ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా ఆలయ వార్షికోత్సవం

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

జయపురం: జయపురం సబ్‌డివిజన్‌ కొట్‌పాడ్‌ సమితి ఖెందుగుడలో గ్రామ దేవత మా బవుడి ఆలయ వార్షికోత్సవాన్ని శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాత్రలో కొట్‌పాడ్‌ ఎమ్మెల్యే రూపు భొత్ర కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయంగా ఈ పూజలు చేపట్టారు. గ్రామ ప్రజలను సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని అమ్మవారిని ప్రార్థించారు. అమ్మవారి వార్షికోత్సవాలను తిలకించేందుకు అనేక గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు, ప్రజలు తరలివచ్చారు. భక్తులను అమ్మవారి పూజారి ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement