రాయగడ: సెంచూరియన్ విశ్వవిద్యాలయం, సి క్యూ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా సెంచూరియన్ –కౌశల్ సాథీ పేరుతో స్థానిక బిజూ పట్నాయక్ ఆడిటోరియంలో ఆదివారం ప్రతభావంతులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ఓఏవీ పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అలాగే ఉత్తమ విద్యావేత్తలను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో కేవలం చదువుతో సరిపొదని నైపుణ్య ఆధారిత విద్య యువతను ఆత్మనిర్భరంగా మార్చగలదని అన్నారు. యువత తమ భవిష్యత్‌ను నైపుణ్యాలు, వినూత్న ఆలోచనలతొ నిర్మించుకోవాలని హితవు పలికారు. ముఖ్యవక్తగా పాల్గొన్న ఏడీఎం నవీన్ చంద్ర నాయక్ మాట్లాడుతూ.. విద్యతో పాటు ఇతర అంశాలపై కూడా వి ద్యార్థులు ఆసక్తి కనబరచాలని అన్నారు. సెంచూరియన్ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ సంబిత్ నాయక్ మాట్లాడుతూ.. నైపుణ్య విద్య ద్వారా విద్యార్థులు ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలకు చేరువయ్యే అవకాశం ఉందని అన్నారు. విద్యావేత్త డాక్టర్ కెకే మహాంతి, సెంచూరియన్ వర్సిటీ ప్రాంతీయ శాఖ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢిలు మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని ఆసీమ పండటో పాటు గాయకుడు రాజేష్‌కుమార్ పాఘి కలిసి రూపొందించిన జయ జగన్నాఽథ్ హారే ఆధ్యాత్మిక ఆడియో ఆల్బమ్‌ను ఆవిష్కరించారు.


