బైక్‌ ఢీకొని మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ఢీకొని మహిళ దుర్మరణం

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్‌ మండలం పుక్కల్లపేట పంచాయతీ మోపసుబందరు గ్రామానికి చెందిన పుక్కల్ల ముత్తమ్మ(43) శుభకార్యంలో వంట పని చేసేందుకు బుడుమూరు వచ్చింది. ఆదివారం సాయంత్రం4.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా రణస్థలం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ద్విచక్రవాహనం అతివేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో ముత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. బైక్‌ డ్రైవింగ్‌ చేస్తున్న లావేరు మండలం తామాడ పంచాయతీ సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన నడుమూరి వాసు, ఆమె భార్యకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహ నంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం రిమ్స్‌కు తీసుకెళ్లారు. లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement