ఆకలి కడుపుల సాహిత్యమే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

ఆకలి కడుపుల సాహిత్యమే ముఖ్యం

May 25 2026 9:39 AM | Updated on May 25 2026 9:39 AM

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి

జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌

శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో జనసాహితి 13వ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జన సాహితి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ బి.అరుణ ఆహ్వానం మేరకు అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ కొత్తపల్లి రవిబాబు జనసాహితీ పతాకాన్ని ఆవిష్కరించారు. జనసాహి తి అధ్యక్షులు దివి కుమార్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ యు ద్ధం సర్వకాలీనం–శాంతి మధ్య మధ్యలో విరామం అన్న చర్చిల్‌ మాటలు నేడు వాస్తవంగా తయా రయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కడుపు నిండిన వారి కోసం వచ్చే ప్రేమ సాహిత్యం వేదాంత సాహిత్యం కంటే ఆకలి కడుపుల కోసం రాసిన సాహిత్యం విలువైనదని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘అల్లూరి సీతారామరాజు’ బురక్రథ, ‘యుద్ధం ఓ వినాశనం’ నాటిక, యుద్ధానికి వ్యతిరేకంగా కలకత్తా ముందడుగు సంస్థ వారి ’స్లైడ్‌షో’, గోర్కి నవల ’అమ్మ’ ఆధారంగా కలకత్తా సౌవిక్‌ సాంస్కృతిక చక్ర వారి నాటక ప్రదర్శనలు జరిగాయి. సభలో డాక్టర్‌ తుర్లపాటి రాజేశ్వరి రచించిన ‘సాహిత్య సమాలోచన’ పుస్తకాన్ని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జన సాహితి ప్రచురించిన ‘మా బాల్యం’ పుస్తకాన్ని వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌, ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌.వేణుగోపాల్‌, ‘ఐఎంఎఫ్‌ అప్పు పతన సంస్కృతి ముప్పు’ పుస్తకాన్ని జనసాహితి రాష్ట్ర కోశాధికారి డాక్టర్‌ శాంతి కుమార్‌, ‘తరగతి గది నా ఆచరణ’ పుస్తకాన్ని అంకురం సినిమా దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, ‘సరిహద్దులు ఎరుగని స్వప్నాలు’ అనే పుస్తకాన్ని జన సాహితి రాష్ట్ర నాయకులు డాక్టర్‌ జీవీ కృష్ణయ్య ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement